Kaleshwaram Investigation: కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. నేటి నుంచి మళ్లీ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లు, ఉన్నతాధికారులను జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారించనున్నారు. గతంలో విచారణకు హాజరైన వారిని కూడా మరోసారి పిలిపించనున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ విచారణ కొనసాగుతుందని సమాచారం. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా తుది నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డీజీని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు.