పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
ప్రతిపక్షం, షాద్ నగర్, మే 21: షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలోని ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి విశేష కళ్యాణం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దేవదేవుని విశేష కల్యాణాన్ని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ -కవిత, వై. మురళీకృష్ణ- హిమబిందు దంపతులు స్వామివారి కళ్యాణం నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణతో పాటు కళ్యాణం విశిష్టతను, దాని వల్ల కలిగే మంచిని అర్ధాలతో సహా వివరించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. కళ్యాణ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, నాయకులు లక్ష్మినారాయణ గౌడ్,మురళీధర్ రెడ్డి,గోగు వెంకట్ నారాయణ రెడ్డి, పల్లె నర్సింగ్ రావు,అంజిరెడ్డి, యారం శేఖర్ రెడ్డి, జమాల్ ఖాన్, ప్రేమ్ కుమార్ గౌడ్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.