ప్రతి పక్షం, దుబ్బాక, మే 18: అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం పట్టుకున్న ఘటన దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చీకోడ్ గ్రామంలో చోటుచేసుకుంది. పెద్ద చీకోడ్ గ్రామంలో అయితే గురుపాదం తండ్రి హనుమయ్య తన ఇంటిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ప్రభుత్వ రేషన్ బియ్యం డంపు చేశాడని.. సమాచారంతో సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, దుబ్బాక పోలీసులతో కలిసి పట్టుకున్నారు. దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు. ఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.