KTR Counter to Bandi Sanjay: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అలాంటి మీరు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై నిందలు వేస్తున్నారు. అది మీ హోదాకు తగదు. మీ స్థానానికి తగినది కాదు.’ అని కేటీఆర్ విమర్శించారు.
ఇదిలా ఉండగా, కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘అలుపెరగకుండా మీరు చేసిన ప్రయత్నాలు చివరికి ఫలించాయి. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికీ దక్కిన విజయం. బీఆర్ఎస్ నాయకురాలు బెయిల్‌పై బయటకు వస్తున్నారు. కాంగ్రెస్ నేత రాజ్యసభకు వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, న్యాయవాదులకు అభినందనలు’. అంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు.