Trending Now

తీన్మార్ మల్లన్నను చట్టసభలకు పంపాలి

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల

ప్రతిపక్షం, నకిరేకల్, మే 14: కుటుంబ ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చి ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నాడని, ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లో ఎక్కడ లేడని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నీతి, నిజాయితీగా గల తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడని, అలాంటి వ్యక్తిని చట్టసభలకు పంపించాల్సిన అవసరం ఉందన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ సమావేశం నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వేముల వీరేశం, అభ్యర్థి తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నేతలు, పట్టభద్రులను ఉద్దేశించి ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ.. నిబద్దత, నికార్సైన వ్యక్తి ఏదైనా సాధించగలడు అనేదానికి మల్లన్న నిదర్శనమని అన్నారు.

తెలంగాణ ప్రజలకు వాస్తవాలను, గ్రత ప్రభుత్వ అవినీతిని తెలియజేయడం వల్లనే వారు చైతన్యవంతులై కేసీఆర్ ని గద్దె దింపి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. మల్లన్నకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అభ్యర్థి మల్లన్న మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలిచి అవినీతిపై పోరాటం చేస్తున్నందునే కేసీఆర్ తనపై వందల కేసులు పెట్టించాడని, అయినా భయపడకుండా కేసీఆర్ ను గద్దె దించే వరకు పోరాటాన్ని ఆపలేదని అన్నారు. పట్టభద్రులందరూ తనకు మద్దతునిచ్చి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సమావేశంలో మాజీ ఉపాద్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, చామల శ్రీనివాస్, పోకల దేవదాసు, దైద రవీందర్, బాచుపల్లి రవీందర్ రావు, మాద యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News