ప్రతిపక్షం, జూలై 31, హైదరాబాద్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని సీఎం పేర్కొన్నారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటని అన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి, తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

















