[t4b-ticker]

కూతురి పెళ్లి ఇష్టం లేక కాలేజీలోనే కత్తితో దాడి

ప్రతిపక్షం, జూలై 31: విజయపుర జిల్లాలో కుటుంబ కలహాలు దారుణానికి దారితీశాయి. కూతురి పెళ్లిని వ్యతిరేకించిన తండ్రి, ఆమెపై కాలేజీ ప్రాంగణంలోనే కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

పోలీసుల వివరాల ప్రకారం, విజయపురకు చెందిన లక్ష్మీదుర్గ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమెకు వివాహ సంబంధం రావడంతో కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే, తన కూతురిని చదివించేందుకు ఎంతో ఖర్చు చేశానని, పెళ్లి చేసుకోవాలంటే రూ.40 లక్షలు ఇవ్వాలని వరుడి కుటుంబాన్ని తండ్రి నాగేంద్ర డిమాండ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, పెళ్లి తర్వాత కూడా కూతురు జీతం తనకే ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

నాగేంద్ర వైఖరిని కుటుంబ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆయన ఆగ్రహానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో విధులకు వెళ్లిన లక్ష్మీదుర్గపై కాలేజీ ప్రాంగణంలోనే కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, విద్యాసంస్థల్లో భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.

Spread the love

Related News

Latest News