[t4b-ticker]

రాష్ట్ర ద్రోహి సజ్జల: విజయసాయి రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 29: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర ద్రోహిగా అభివర్ణించారు. తనను నమ్మక ద్రోహిగా చిత్రీకరిస్తూ సజ్జల వర్గం దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తాను నిజంగా నమ్మక ద్రోహినైతే సజ్జల మాదిరిగా కాంగ్రెస్‌తో రాజీపడి, సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో తన పేరు లేకుండా చేసుకునేవాడినని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా తాను అప్రూవర్‌గా మారేవాడినని, కానీ అలా చేయలేదని స్పష్టం చేశారు. ‘సకల శాఖామంత్రి’గా పేర్కొంటున్న సజ్జల పేరు ఏ ఛార్జిషీట్‌లోనూ లేదని విజయసాయిరెడ్డి అన్నారు. జగన్‌కు వెన్నుపోటు పొడిచి కేసుల నుంచి తప్పించుకోవడం తనకు తెలియదని పేర్కొంటూ ఓపెన్ లెటర్ విడుదల చేశారు.

Spread the love

Related News

Latest News