[t4b-ticker]

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంపై బీజేపీ దాడిని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ శ్రేణులు

*మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ ఆఫీస్ పై దాడిని ఖండించిన కాంగ్రెస్ శ్రేణులు.
*మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక.
*బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిల్లర నాయకుడు – ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఫైర్.
*దాడికి ప్రతిదాడి తప్పదు – బీజేపీకి బుర్రి శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్.

ప్రతి పక్షం నల్గొండ సెప్టెంబర్ 01: నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంపై బీజేపీ నాయకులు చేసిన దాడిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. సోమవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

*ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ…
ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, కానీ సంస్కారహీనంగా, విలువలు మర్చిపోయి ఇంటిపై దాడి చేయడం సరికాదని అన్నారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఒక చిల్లర నాయకుడని, బీజేపీలో విలువలు కలిగిన నాయకులు ఎంతో మంది ఉన్నారని, ఇలాంటి చిల్లర పనుల వల్ల ఆ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు.నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వచ్చి దాడి చేస్తే తాము ఊరుకుంటామా అని, తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఇక్కడ బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనని, ఇద్దరూ కలిసి ప్రశాంతంగా ఉన్న నల్లగొండను రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తమ్ముని కార్పొరేటర్ గా కూడా గెలిపించుకోలేని చిల్లర గాళ్లు కూడా సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి పిచ్చి లేసినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…

దాడికి ప్రతిదాడి ఎప్పుడైనా ఉంటుందని బీజేపీ శ్రేణులను తీవ్రంగా హెచ్చరించారు. మంత్రి ఇంటిపై దాడి చేసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి తన కార్యాలయంలో దాక్కుంటున్నాడని, దమ్ముంటే బయటకు రావాలని సవాల్ చేశారు.మంత్రి ఇంటిపై దాడి చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటామా అని, ప్రతిదాడి తీవ్రంగా ఉంటుందన్నారు. తాము ఎప్పుడూ విలువలకు కట్టుబడి నిరసనలు తెలిపామని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి చిల్లర గాడని, అతనికి తగిన బుద్ధి చెప్పే వరకు వదిలిపెట్టమని అన్నారు. అతని తల్లిపై దాడి చేసినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, చిల్లర పనులు చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో, పత్రికల్లో రావాలని చూస్తున్నాడని విమర్శించారు. అదేవిధంగా విలువలు మర్చి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్నాడని అన్నారు. మమ్మల్ని ఎవరైనా రెచ్చగొడితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు పరామర్శల పేరుతో నల్లగొండకు వస్తే నల్లగొండ పొలిమేర నుంచి అడ్డుకొని తరిమికొడతామని, మా సహనాన్ని చేతగానితనంగా భావిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, వారిని ఎక్కడ తిరగకుండా చేస్తామని హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News