[t4b-ticker]

420 హామీలపై సమరభేరి – కాంగ్రెస్ దగా పాలనపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గర్జన.

*వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై మునుగోడు గడ్డపై బీఆర్ఎస్ భారీ ధర్నా.

*మునుగోడులో బీఆర్ఎస్ సమరభేరి – కాంగ్రెస్ పై కూసుకుంట్ల ఫైర్

*420 హామీలపై మునుగోడు గడ్డపై గర్జించిన కూసుకుంట్ల

*కాంగ్రెస్ దగా పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నా — ప్రజల కోసం పోరాటం

*వంద కార్లు, వందలాది బైకులు, వేలాదిమంది కార్యకర్తలతో దద్దరిల్లిన మునుగోడు

*మునుగోడులో ప్రజా గళమై నిలిచిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి .

ప్రతి పక్షం మునుగోడు, సెప్టెంబర్ 02: వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా నయవంచనకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరి మోగించింది. మునుగోడు ముద్దుబిడ్డ, మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు గడ్డ మరోసారి ఉద్యమ గర్జనతో దద్దరిల్లింది.

కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ భారీ ధర్నాలో వంద కార్లు, వందలాది బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తారు. “420 హామీలు అమలు చేయాలి – ప్రజలకు న్యాయం చేయాలి” అంటూ నినాదాలతో మునుగోడు మార్మోగింది.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలను పూర్తిగా మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. రైతు భరోసా, రుణమాఫీ, యువతకు ఉద్యోగాలు, మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సక్రమంగా అమలు కావడం లేదని, ఇది దగా పాలనకు నిదర్శనమని అన్నారు. ప్రజల కోసం పోరాటం, మునుగోడు కోసం గర్జన ఆగదని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News