[t4b-ticker]

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలకు తీవ్ర నిరసన

హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దగ్ధం

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

విద్యార్థుల తరగతుల బహిష్కరణ

ప్రతిపక్షం, నంగునూరు, సెప్టెంబర్ 17: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నంగునూరు మండల కేంద్రంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయన వ్యాఖ్యలను నాయకులు తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ ఆశయాలను, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో భాగంగా విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. పాఠశాలల బంద్ నిర్వహించారు.

హమారా ప్రసాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అనంతరం హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నంగునూరు తహసీల్దార్ ప్రవీణ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాజగోపాలపేట పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నంగునూరు సర్పంచ్ సానాదుల బాలపోచయ్య, నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, తెలంగాణ ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి రాజేందర్ పాల్గొన్నారు.అలాగే మండల దళిత సంఘం నాయకులు అల్లిబిల్లి నరసింగరావు, దేవులపల్లి రాజమౌళి, దేవులపల్లి అయిలయ్య, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు దేవులపల్లి బాలరాజు, ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పాపిగాని నరేశ్ పాల్గొన్నారు.అంబేద్కర్ సంఘం నాయకులు దాసరి రమేశ్, బడే రాజయ్య, జెల్ల మహేందర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News