ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక ప్రజా పాలన దినోత్సవం – సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలి.
జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు.
ప్రతి పక్షం చండూరు, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా చండూరు మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో గురువారం ఉదయం 9:30 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు గారు* జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగిన రోజని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, ప్రజల ఆకాంక్షలు మరియు ప్రజా భాగస్వామ్యంతో కూడిన పాలనకు ఈ రోజు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అందేలా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఎల్. మల్లేశం, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, సామ సుజాత యాదవ రెడ్డి, జెల్ల ధనమ్మ శ్రీనివాస్, కొన్రెడ్డి మధు, కోడి సుష్మ వెంకన్న, కటకం రమేష్, కో-ఆప్షన్ సభ్యులు షేక్ ఖలీల్, మొగుదాల సత్తమ్మ వెంకన్న, షేక్ సలీమా షరీఫ్, మేనేజర్ జి. రాములు, సీనియర్ అసిస్టెంట్ ఏ. సాయిభారద్వాజ్, వార్డ్ ఆఫీసర్లు జి. శ్రీరాములు, ఏ. జగన్, బి. సాయిరాం, బిల్ కలెక్టర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

































