Trending Now

పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా జరగాలి

బల్దియా ఇన్ చార్జి కమిషనర్ రాధిక గుప్తా

18,27,28 డివిజన్ లలో శానిటేషన్, నీటి సరఫరా తీరు పరిశీలన

అపరిశుభ్ర వాతావరణం లో దుకాణాలు నిర్వహిస్తున్న యాజమాన్యాలకు జరిమానా

ప్రతిపక్షం బ్యూరో ‌‌, వరంగల్​

పటిష్టంగా పారిశుధ్య నిర్వహణ జరగాలని బల్దియా ఇన్ చార్జి కమిషనర్ రాధిక గుప్తా అన్నారు.
సోమవారం బల్దియా పరిధి లోని 18,27,28 డివిజన్ లలో శానిటేషన్, నీటి సరఫరా,పన్నుల వసూలు తీరు ను క్షేత్ర స్థాయి లో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భం గా వరంగల్ చౌరస్తా,పోస్టాఫీసు, రామన్నపేట, పిన్న వారి వీధి, బట్టల బజార్,ఓల్డ్ బీట్ బజార్,అండర్ రైల్వే బ్రిడ్జి,ఎస్ టు ప్రాంతం లో శానిటేషన్ స్థితి గతులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఓల్డ్ బీట్ బజార్ ప్రాంతం లో అపరిశుభ్ర వాతావరణం లో దుకాణాలు నిర్వహిస్తున్న ఇద్దరు ఉల్లి గడ్డల వ్యాపారులకు పెనాల్టీ విధించాలని ముఖ్య ఆరోగ్యాధికారిని ఆదేశించారు.
ఈ సందర్భం గా ఇంచార్జీ కమీషనర్ మాట్లాడుతూ డ్రైనేజీ లను క్రమం తప్పకుండా శుభ్రం గా ఉండేలా, చెత్త నిలువ ఉండకుండా చూడాలని అన్నారు.
పరిశీలనలో భాగం గా 27 వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ పలు స్థానికం గా ఉన్న సమస్యలను ఇంచార్జీ కమీషనర్ దృష్టి కి తీసుకువస్తు స్మార్ట్ సిటీ పైపుల వల్ల తమ డివిజన్ లో చాలా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, వాటి వల్ల పైపులలో సిల్ట్ పేరుకు పోయి నీటి సరఫరా సక్రమం గా జరుగడం లేదని, తాత్కాలికం ఏర్పాటు చేసిన వరంగల్ బస్ స్టాండ్ ను ప్రస్తుతం మేడారం జాతర పాయింట్ గా వాడుతున్నారని అక్కడ రోడ్డు విస్తరణ జరుగక పోవడం వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, గోల్డెన్ త్రిషోల్డ్ పాఠశాల ప్రాంతం లో రోడ్డు విస్తరణ చేయాలని కోరారు.
అబ్బనికుంట ప్రాంతం లో నీటిసరఫరా తీరు పరిశీలనలో భాగం గా స్థానికం ప్రజలతో మాట్లాడిన ఇంచార్జీ కమీషనర్ తాగునీరు సరిగా వస్తుందా?నీటి సరఫరా లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?అని అడుగాగా ఏలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.
అనంతరం నయీం నగర్ ప్రాంతం లో పర్యటించిన ఇంచార్జీ కమీషనర్ పన్ను వసూళ్ల పురోగతినీ పరిశీలించి ప్రణాళిక బద్దంగా పన్నుల సేకరణ జరగాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో సి ఎం హెచ్ ఓ డా.రాజేష్, ఈ ఈ శ్రీనివాస్,డి. ఈ లు సారంగం,రవి కిరణ్,శానిటరీ సూపర్ వైజర్ సాంబయ్య, ఏ ఈ లు సతీష్ హబీబ్ సౌజన్య,శానిటరీ ఇన్స్పెక్టర్ లు సంపత్ రెడ్డి,కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.

Spread the love