[t4b-ticker]
ధరణి భూ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన

ధరణి భూ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన

ప్రతిపక్షం, సెప్టెంబర్ 17: ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని భూముల విషయంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ వ్యవహారాలపై ప్రత్యేక విచారణ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. భూముల దోపిడీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ప్రత్యేక విచారణ బృందానికి అప్పగించి సమగ్రంగా విచారణ జరిపిస్తామని తెలిపారు. నిషేధిత జాబితా 22ఏపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి భూ సమస్యల చరిత్ర, ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తెలంగాణలో భూములకు సంబంధించి కాలక్రమంలో నాలుగు ప్రధాన రకాల సమస్యలు ఏర్పడ్డాయని రేవంత్‌ రెడ్డి వివరించారు. నిజాం కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వరకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను సభ ముందుంచారు. భూముల రికార్డులు,...
ప్రచారక్ టూ ప్రధాని.. గ్లోబల్ లీడర్‌గా మోదీ

ప్రచారక్ టూ ప్రధాని.. గ్లోబల్ లీడర్‌గా మోదీ

ప్రతిపక్షం, సెప్టెంబర్ 17: గుజరాత్‌లోని వాద్‌నగర్‌ నుంచి దేశ ప్రధానమంత్రి పదవి వరకు సాగిన నరేంద్ర మోదీ ప్రస్థానం భారత రాజకీయాల్లో ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచింది. 1950 సెప్టెంబర్‌ 17న గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో జన్మించిన మోదీ చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ప్రజాసేవ పట్ల ఆసక్తి పెంచుకున్నారని ప్రధానమంత్రి కార్యాలయం వివరించింది. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌లో కార్యకర్తగా పనిచేస్తూ ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. మోదీ రాజకీయ ప్రయాణంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కీలక పాత్ర పోషించింది. 1970ల ప్రారంభంలో అహ్మదాబాద్‌లో సంఘ్‌తో అనుబంధం ఏర్పరుచుకున్న ఆయన ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో సంస్థాగత కార్యక్రమాలు, ప్రజలతో మమేకం కావడం, వివిధ...
22ఏ భూముల సమస్యకు 30 రోజుల్లో పరిష్కారం.. హైపవర్ కమిటీ ఏర్పాటు: రేవంత్

22ఏ భూముల సమస్యకు 30 రోజుల్లో పరిష్కారం.. హైపవర్ కమిటీ ఏర్పాటు: రేవంత్

ప్రతిపక్షం, సెప్టెంబర్ 16: తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న నిరుపేదల ఆస్తుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. నిరుపేదలకు సంబంధించిన న్యాయమైన, చట్టబద్ధమైన ఆస్తుల విషయంలో అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 22ఏ నిషేధిత జాబితా వివాదాలను పరిశీలించి పరిష్కరించేందుకు ప్రత్యేక ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయానికి చెందిన ప్రత్యేక కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారితో ఈ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు, పెండింగ్ దరఖాస్తులు, చట్టపరమైన అంశాలను కమిటీ పరిశీలించనుంది....
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్

ప్రతిపక్షం, సెప్టెంబర్ 16: తెలంగాణ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన భూములు, ఫామ్‌హౌస్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న భూముల వివరాలపై సమగ్రంగా విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విచారణను నిర్లక్ష్యం చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు వెల్లడించారు. 30 రోజుల్లోగా విచారణ నివేదికను సమర్పించాలని అధికారులకు గడువు విధించినట్లు పేర్కొన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. తెలంగాణ ఉద్యమకారుడిగా తనను తాను చెప్పుకునే కేసీఆర్ కుటుంబానికి భారీ స్థాయిలో ఆస్తులు ఎలా సమకూరాయనే అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయనే దానిపై వివరాలు వెలుగులోకి...
తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమకు సింగపూర్ ఆసక్తి

తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమకు సింగపూర్ ఆసక్తి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 16: తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సింగపూర్ ఆసక్తి వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం తదితర అంశాలపై సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సమావేశమై చర్చించింది. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ శాశ్వత కార్యదర్శి ఆగస్టీన్ లీ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఈ భేటీలో పాల్గొంది. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల పరిస్థితులను ముఖ్యమంత్రి ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం విస్తరణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న సహకారం, భవిష్యత్ అభివృద్ధి...
Spread the love