[t4b-ticker]

Rian Alert: నేడు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి

Rian Alert in Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అదేవిధంగా ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Related News

Latest News