ప్రతిపక్షం, జూన్ 16: క్రూడాయిల్ ధరల అనిశ్చితి, విదేశీ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు, ఎరువుల ధరల పెరుగుదల, తక్కువ వర్షపాతం వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దిగుమతుల్లో అంతరాయం, ముడి పదార్థాల ధరల పెరుగుదల కూడా ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు. అయితే, తక్కువ వర్షపాతం పరిస్థితుల్లోనూ ఆహార ధాన్యాల సరఫరాకు ఇబ్బంది లేకుండా తగినంత బఫర్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.

















