ప్రతిపక్షం, జూన్ 16: తమిళనాడులో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్,డీఎంకే మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. తమను పక్కనపెట్టి టీవీకేతో కాంగ్రెస్ జట్టు కట్టడంపై డీఎంకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై డీఎంకే నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్కు రాజకీయ పరిపక్వత లేదని, ఇండియా కూటమి ఐక్యత గురించి మాట్లాడుతూనే కొన్ని రాష్ట్రాల్లో కూటమిని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు.
అదే సమయంలో కాంగ్రెస్ మనుగడ కోసం డీఎంకే ఎంతో సహకరించిందని పేర్కొంది. అయితే డీఎంకే ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ప్రజల అభిప్రాయాలు, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.















