కేంద్ర మంత్రులతో తుమ్మల, ఉత్తమ్ కీలక భేటీలు.. రైతు సమస్యలపై వినతులు

ప్రతిపక్షం, జూన్ 24: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, రైతుల ప్రయోజనాల కోసం వినతిపత్రాలు సమర్పించారు.

కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో జరిగిన సమావేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, రైతుల ప్రయోజనాల పరిరక్షణ, దేశీయ వంటనూనెల ఉత్పత్తి పెంపుపై చర్చించారు. తెలంగాణ దేశంలోనే అత్యధికంగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రాష్ట్రంగా నిలిచిందని, ప్రస్తుతం మూడు లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందని మంత్రి తుమ్మల వివరించారు.

ఇక కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ నుంచి తెలంగాణకు అవసరమైన యూరియా, డీఏపీ వంటి ఎరువుల సరఫరాపై సానుకూల స్పందన లభించినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించడం రైతాంగానికి మేలు చేస్తుందని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Spread the love

Related News

Latest News