ప్రతిపక్షం, జూన్ 25: హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా అనుభవాల మార్పిడి వంటి అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
ఈ భేటీలో కాన్రాడ్ సంగ్మా సతీమణి మెహతాబ్ చండీ సంగ్మా కూడా పాల్గొన్నారు. అలాగే మేఘాలయ ఉప ముఖ్యమంత్రులు స్నియావ్ భలాంగ్ ధర్, ప్రెస్టోన్ టిన్సాంగ్ హాజరయ్యారు. సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో సాగినట్లు సమాచారం.
ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాల బలోపేతం, వివిధ రంగాల్లో సహకార అవకాశాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

















