ప్రతిపక్షం, జూన్ 29: తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ‘జననాయగన్’ నిర్మాత, కర్ణాటకకు చెందిన వెంకట్ నారాయణను ఢిల్లీలో నియమించడంపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఉదయ్ తీవ్రంగా స్పందించారు.
సీఎం విజయ్ వ్యక్తిగత స్నేహాలు, సినీ సంబంధాల ఆధారంగా ప్రభుత్వ పదవులు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇదే విధానం కొనసాగితే త్వరలోనే నటి త్రిషను ఉప ముఖ్యమంత్రిగా నియమించే పరిస్థితి వస్తుందంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
















