ప్రతిపక్షం, జూన్ 30: శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) కాంగ్రెస్‌లో విలీనం కానుందనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై ఢిల్లీలో జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని, సానుకూలంగా సాగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన శరద్ పవార్ ఎన్‌సీపీని స్థాపించారు. ప్రస్తుతం రెండు పార్టీల విలీనంపై ముమ్మర చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వర్గం) కూడా కాంగ్రెస్‌లో విలీనం అయ్యే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది.

















