[t4b-ticker]

చైనా సంచలనం.. ప్రజలూ యుద్ధం చేయాల్సిందే

ప్రతిపక్షం, సెప్టెంబర్ 03: చైనా రక్షణ రంగానికి సంబంధించి కీలక మార్పులు తీసుకొచ్చింది. యుద్ధ పరిస్థితులు తలెత్తిన సమయంలో దేశ రక్షణ కోసం సాధారణ పౌరులు కూడా తప్పనిసరిగా పోరాటంలో పాల్గొనేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు పౌరుల భాగస్వామ్యం స్వచ్ఛందంగా ఉండగా.. ఇకపై యుద్ధ సమయంలో దేశం తరఫున పోరాడటం తప్పనిసరి చేసేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా దేశ రక్షణ అవసరాల కోసం ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన ఆస్తులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకునేలా చైనా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యుద్ధ సమయంలో దేశంలోని ప్రైవేట్‌ రంగ వనరులను కూడా రక్షణ వ్యవస్థకు అనుసంధానం చేయడం ద్వారా సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త నిబంధనల్లో యుద్ధానికి సంబంధించిన నిర్వచనాన్ని కూడా విస్తరించినట్లు సమాచారం. దేశ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత, భద్రత, జాతీయ ఐక్యతకు ముప్పు కలిగించే చర్యలతో పాటు దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించే పరిస్థితులను కూడా యుద్ధానికి సంబంధించిన చర్యలుగా పరిగణించేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఈ కొత్త నిబంధనలు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం. తాజా మార్పులతో దేశ రక్షణ వ్యవస్థలో సాధారణ పౌరులు, ప్రైవేట్‌ సంస్థల పాత్ర కూడా పెరగనుంది. ముఖ్యంగా యుద్ధం లేదా జాతీయ భద్రతకు సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో దేశంలోని మానవ వనరులు, ప్రైవేట్‌ రంగ ఆస్తులు, సాంకేతిక వనరులను సమన్వయం చేసుకునే విధంగా చైనా తన రక్షణ విధానాన్ని మరింత విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది.

Spread the love

Related News