[t4b-ticker]

BREAKING NEWS: హర్యానా కొత్త సీఎంగా ఈయనే..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: హర్యానా కొత్త ముఖ్యమంత్రి పేరును బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసింది. నూతన సీఎం అభ్యర్థిగా హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయబ్ సింగ్ సైకి బాధ్యతలను అప్పగించింది. రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈరోజు పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీజేపీ, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూటమి విచ్ఛిన్నమైంది. హర్యానాలో లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ-జేజేపీ కూటమిలో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మంగళవారం రాజీనామా చేశారు.

Related News

Latest News