[t4b-ticker]

అనుముల రేవంత్ కాదు.. ఆంధ్ర రేవంత్: కవిత

ప్రతిపక్షం, ఆగస్టు 27: తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌ పదవులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికి కట్టబెట్టారంటూ కవిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. తెలంగాణ బ్రాహ్మణులకు తగిన గౌరవం దక్కాల్సిందేనని ఆమె డిమాండ్‌ చేశారు. బ్రాహ్మణ పరిషత్‌ చైర్మన్‌, ఉపాధ్యక్షులను తక్షణమే తొలగించాలని కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ అంటే అనుముల రేవంత్‌ కాదని, ‘ఆంధ్ర రేవంత్‌’ అని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ పరిషత్‌ పదవుల విషయంలో తెలంగాణకు చెందిన వారికి అన్యాయం జరిగిందని ఆమె ఆరోపించారు. ఈ నియామకాలపై ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదే సమయంలో మాజీ మంత్రి హరీశ్‌రావుపైనా కవిత సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్‌ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం భారతీయ జనతా పార్టీ మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో హరీశ్‌రావుకు మిలాఖత్‌ ఉందని చెప్పేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని కవిత పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Spread the love

Related News

Latest News