Trending Now

నిర్మల్‌లో పీర్ల సముదాయం కూల్చివేత, విక్రయం

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 25 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోమవార్ పేట్ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న చారిత్రాత్మక ప్రసిద్ధ చున్న మున్ను (పీరీల సముదాయం) ఆశూర్ ఖానా ను నిర్వాహకులు అక్రమంగా విక్రయించి కూల్చివేయడాన్ని గుర్తించిన నిర్మల్ ఏఐఎంఐఎం శాఖా అధ్యక్షుడు అజీం బిన్ యాహియ సదరు ప్రాంతానికి చేరుకొని విక్రయాన్ని నిరసిస్తూ.. ఆందోళన చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ దస్తగిర్ కు వాస్తవ సమాచారాన్ని ఇచ్చి కూల్చి వేసిన ఆశూర్ ఖానా ప్రదేశానికి రావాలని ఆదేశించారు. ఈ మేరకు చేరుకున్న వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ దస్తగిర్ ఆశూర్ ఖానా సముదాయ విస్తీర్ణం, చారిత్రాత్మక కట్టడం వాస్తవ విషయాలు రికార్డుల ఆధారంగా ఆరా తీశారు. ఈ మేరకు వెంటనే చిన్ను మున్ను పీర్లకు సంబంధించిన తాజాలను వెంటనే తీసుకొచ్చి అక్కడ ప్రతిష్టింపజేశారు. వర్క్ బోర్డ్ అనుమతులు లేకుండా ఎలాంటి విక్రయాలు చేయరాదని హెచ్చరించారు. అక్రమంగా వక్ఫ్ బోర్డు కట్టడాలు సముదాయాలు భూములను క్రయవిక్రయాలు చేస్తే కఠినమైన రీతిలో చర్యలు తీసుకొని తగిన విధంగా శిక్షలు పడేలా వక్ఫ్ బోర్డు చూసుకుంటుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్స్పెక్టర్ దస్తగీర్ ఈ సందర్భంగా తెలిపారు. సదరు ప్రదేశంలో వెంటనే ఆశూర్ ఖానా పున : నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Spread the love