ప్రతిపక్షం, హైదరాబాద్ స్టేట్ బ్యూరో: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం సోమవారం ఉదయం మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్యక్షతన జరిగింది. అంతకు ముందు పలు అంశాలపై అధికార, విపక్ష సభ్యులు ఆరోపణలు ప్రత్యారోపణలతో దద్దరిల్లింది. అనంతరం 2024.25 ఆర్థిక సంవత్సరానికి గాను జీహెచ్‌ఎంసీ బడ్జెట్ రూ.8437 కోట్లుగా సమావేశం ఆమోదించింది. అలాగే రెవెన్యూ ఆదాయం రూ.5938 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.3458 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.2,480 కోట్లు, కాపిటల్ నిధులు రూ.1,999 కోట్లు, కాపిటల్ వ్యయం రూ. 4,479 కోట్లుగా జీహెచ్ఎంసీ తెలిపింది. అలాగే హౌసింగ్ కోసం ప్రత్యేకంగా రూ.500 కోట్లు కేటాయించినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది.