Trending Now

టీపీసీసీ ఆమోదంతోనే చేరికలు..? కాంగ్రెస్‌లో చేరేందుకు ఇతర పార్టీల నేతల చొరవ

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఇతర పార్టీలకు చెందిన పలువురు సీనియర్​ నేతలతో పాటు జిల్లా, నియోజకవర్గాల నేతలు అధికార పార్టీ కాంగ్రెస్​లో చేరేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇటీవల పార్టీలో చేరిన కొందరు నేతలపై స్థానిక పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే పార్టీలో ఫలానా నేత చేరుతున్నాడంటూ వస్తున్న వార్తలపై కూడా స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. దీంతో ఇకపై పార్టీలో చేరనున్న ఇతర పార్టీలకు చెందిన నేతలకు టీపీసీసీ ఆమోదించాలని, అనంతరం వారు పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ ఆదేశించినట్లు సమాచారం. పెద్ద పెద్ద నాయకుల చేరికల విషయంలో పీసీసీ, ఏఐసీసీ అనుమతితో ముందుకెళ్తుండగా చిన్న చిన్న నేతల విషయంలో సమన్వయం కొరవడుతోంది. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లు జిల్లా అధ్యక్షులకి సమాచారం లేకుండా చేరికలు జరుగుతున్నాయన్న ఆందోళన పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.అధికార కాంగ్రెస్‌లో చేరేందుకు ఇతర పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున చొరవ చూపుతున్నారు. బీఆర్ఎస్‌, బీజేపీకి చెందిన వివిధ స్థాయిల నేతలు హస్తం పార్టీ కండువా కప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు. పార్టీలోకి వచ్చేవారు ముందుగా పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించాల్సి ఉంది. పెద్ద నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయించినప్పుడు ఏఐసీసీ అనుమతి తీసుకొని కార్యక్రమం చేపడుతున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కానీ కొందరు నేతలు ఎన్నికల వేళ పార్టీని వీడి బీఆర్ఎస్‌, బీజేపీలో చేరారు. వారిలో కొందరు తిరిగి సొంతగూటికి వచ్చేందుకు చొరవ చూపుతున్నారు. కొందరు నాయకులు పీసీసీకి సమాచారం లేకుండానే రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ చేతుల మీదుగా కండువా కప్పుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండడంతో చిన్నపాటి నాయకుల చేరికపై పీసీసీలో చర్చకు రావట్లేదని తెలుస్తోంది.

నేరుగా రాష్ట్ర ఇంఛార్జ్ వద్ద కండువా కప్పుకొని హస్తం పార్టీలోకి రావటంతో స్థానిక డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఇతర పార్టీల్లోకి వెళ్లి ఓటమిపాలై తిరిగి కాంగ్రెస్‌లో చేరుతుండడం స్థానిక నాయకత్వానికి ఇబ్బందిగా పరిగణిస్తోంది. తద్వారా క్షేత్రస్థాయిలో సమన్వయం లోపించి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇబ్బందులు వస్తాయని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు చేరేముందు స్థానిక నాయకత్వం ద్వారా పార్టీలో చేరేలా చేయాలని డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ బలోపేతానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలే గాంధీభవన్‌లో దీపాదాస్ మున్షీ సమక్షంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి, పటాన్‌చెరు నాయకుడు నీలం మధు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారంతా పీసీసీతో చర్చించి ఏఐసీసీ ఆమోదంతో చేరినట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికలవేళ మునుగోడు నియోజకవర్గ నేత చలమల కృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆపార్టీ తరఫున పోటీచేశారు. ఓటమి పాలుకావడంతో హస్తం పార్టీలోకి వచ్చేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు.


ఇటీవలే రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీని కలిసిన చలమల కృష్ణారెడ్డి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్నమునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అభ్యంతర వ్యక్తంచేసినట్లు సమాచారం. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు తెలియకుండా ఆయనను ఎలా పార్టీలో చేర్చుకుంటారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

Spread the love