నీట్ పరీక్ష నిర్వహణపై రాహుల్ గాంధీ ఆగ్రహం

ప్రతిపక్షం, జూన్ 20: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ విద్యార్థికి నీట్ పునఃపరీక్ష కేంద్రాన్ని పొరపాటున అబుదాబిలో కేటాయించిన ఘటనపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పట్టణంలోనే పరీక్షా కేంద్రం కేటాయించలేని పరీక్ష నిర్వహణ సంస్థకు జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించే అర్హత లేదని ఆయన విమర్శించారు.

పాస్‌పోర్ట్ కూడా లేని, విదేశాలకు వెళ్లే ఆర్థిక స్థోమత లేని విద్యార్థి ఈ తప్పిదంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఇలాంటి నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమేనని ఆయన అన్నారు.

విద్యార్థుల సమయం, మానసిక ప్రశాంతత, భవిష్యత్తును దెబ్బతీసే విధంగా పరీక్షా వ్యవస్థ పనిచేయకూడదని రాహుల్ గాంధీ సూచించారు. దేశంలోని విద్యార్థులకు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన, నమ్మకమైన పరీక్షా విధానం అందించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News