ప్రతిపక్షం, వెబ్డెస్క్: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటం విశేషం. ”సామాజిక సేవ, విద్య సహా పలు అంశాల్లో ఆమె స్ఫూర్తిదాయక ముద్ర వేశారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆమె రాజ్యసభలో ఉండటం నారీశక్తికి నిదర్శనం. తన బాధ్యతను సుధామూర్తి పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తారని ఆశిస్తున్నా” ఆకాంక్షించారు.