ప్రతిపక్షం, ఆగస్టు 22: రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బుక్‌మైషోలో చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా పేరిట ఉన్న ఆల్‌టైమ్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డును ‘ఇరుముడి’ అధిగమించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బుక్‌మైషోలో ఒక గంటలోనే సుమారు 31.6 వేల టికెట్ల విక్రయాలు నమోదు చేసింది. అయితే ‘ఇరుముడి’ సినిమా అదే సమయంలో 32.25 వేల టికెట్ల బుకింగ్స్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు సమాచారం.
పాన్ ఇండియా చిత్రాలను పక్కన పెడితే.. ప్రాంతీయ చిత్రాల విభాగంలో బుక్‌మైషోపై ఒక గంటలో అత్యధిక టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన సినిమాగా ‘ఇరుముడి’ నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విడుదలకు ముందే ఈ స్థాయిలో స్పందన రావడం చిత్రబృందంలో ఉత్సాహాన్ని పెంచుతోంది.
రవితేజ కెరీర్‌లోనే భారీ అంచనాలున్న చిత్రాల్లో ‘ఇరుముడి’ ఒకటిగా నిలుస్తోంది. సినిమా కథ, రవితేజ నటన, ప్రచార కార్యక్రమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడంతో అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు చిరంజీవి సినిమా పేరిట ఉన్న రికార్డును రవితేజ చిత్రం అధిగమించడంతో అభిమానుల్లోనూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. విడుదలకు ముందే బుకింగ్స్‌లో రికార్డు నమోదు చేసిన ‘ఇరుముడి’.. థియేటర్లలో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.























