[t4b-ticker]

ఉద్యోగుల సమస్యల సాధనకై కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

నల్ల బ్యాడ్జీలు తో పాల్గొన్న ఉద్యోగస్తులు

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం జేఏసీ చైర్మన్ దొంతి నరేందర్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 27: ఉద్యోగుల సమస్యల సాధనకై జేఏసీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగస్తులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ దొంతి నరేందర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పిఆర్సి నివేదిక ఫిట్మెంట్ ప్రకటన, ఆరు విడతల కరువు భత్యం, ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులు, నూతన పెన్షన్ విధానం రద్దు, ఉద్యోగి 1.5 శాతం కాంట్రిబ్యూషన్ తో నగదు రహిత ఆరోగ్య కార్డుల సక్రమ అమలు ఐదు ప్రధాన డిమాండ్లతో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ మహాధర్నా కార్యక్రమంలో టీఎన్జీవో, టీజీవో, పి ఆర్ టి యు, యు టి ఎఫ్, టి పి టి ఎఫ్, టిఆర్టిఎఫ్, పెన్షనర్స్ అసోసియేషన్ తదితర సంఘాలు పాల్గొన్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లను జేఏసీ ప్రతినిధులు విటల్, రాజ్ కుమార్, నాగభూషణం, పద్మారావు, కొంగోటి యాదగిరి, సౌమ్య నాయక్, నర్సింగ్ రావు, జగదీష్ చంద్ర, శ్యాంసుందర్, సంగయ్య, ఇక్బాల్ పాషా, ఫజాలుద్దీన్, లీల, శివాజీ, రాధ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News