Trending Now

‘డీప్‌ఫేక్‌’లను అడ్డుకునేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్..

ప్రతిపక్షం, టెక్నానాలజీ: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఉపయోగించి రూపొందించిన డీప్‌ఫేక్‌లను నియంత్రించడానికి వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్టు మెటా ప్రకటించింది. ఫ్యాక్ట్-చెకింగ్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించేందుకు మిస్-ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలయన్స్(ఎంసీఏ), మెటా సంయుక్తంగా పనిచేయనున్నట్టు ఇరు సంస్థలు సోమవారం ప్రకటనలో వెల్లడించాయి. హెల్ప్‌లైన్ ద్వారా ప్రత్యేక వాట్సాప్ చాట్‌బాట్‌కు డీప్‌ఫేక్, నకిలీ సమాచారాన్ని పంపడం ద్వారా వాటిని కట్టడి చేసే వీలుంటుందని, ఈ ఏడాది మార్చి కల్లా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు మెటా తెలిపింది. ఈ చాట్‌బాట్ ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లోనూ సేవలందిస్తుందని మెటా ప్రకటించింది.

Spread the love

Related News

Latest News