ప్రతిపక్షం, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. HYDలోని చంద్రబాబు నివాసంలో దాదాపు గంటకు పైగా వారిద్దరూ వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల పేర్లు, స్థానాల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. బీజేపీకి కేటాయించే స్థానాలపై కూడా చర్చించినట్లు సమాచారం. కాగా, 2024 ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. రేపు మరో లిస్టులో పూర్తి అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కూటమి పార్టీలు తమ అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.