Trending Now

సీఎం మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన పొలిటికల్ డ్రామానే..

రాష్ట్ర బీజేపీ చీఫ్​ కిషన్​రెడ్డి
హనుమకొండ జిల్లా:
సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన ఒక పొలిటికల్ డ్రామా అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు,కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం హనుమకొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… ఈనెల 20వ తేదీ నుంచి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచంలో ముందుకు దూసుకెళ్తున్నామని తెలిపారు. 4.5 కోట్ల మంది పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇళ్లను కట్టించి ఇచ్చిందని తెలిపారు. మోదీకి దేశ వ్యాప్తంగా అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. ప్రత్యర్థి కూటములకు బీటలు వారుతున్నాయని చెప్పారు. తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్న స్థానాల్లో కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర దర్యాప్తు జరిపే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు దెబ్బతిన్న వెంటనే గత ఏడాది అక్టోబర్ 22వ తేదీన కేంద్ర జలశక్తి మండలికి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు ప్లానింగ్‌లో లోపలున్నాయని కేంద్ర జలశక్తి మండలి రిపోర్ట్ ఇచ్చిందని కిషన్‌రెడ్డి తెలిపారు.

Spread the love