ప్రతిపక్షం, జూన్ 13: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ నామినేషన్ వ్యవహారంలో బీజేపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి కేసు లేదని, కేవలం నోటీసు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఆమెను రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకునేందుకే రాజకీయ కుట్ర జరిగిందని ఆరోపించారు.
గాంధేయవాది, నిజాయతీకి ప్రతీక అయిన మీనాక్షిని లక్ష్యంగా చేసుకుని బీజేపీ వ్యవహరించిందని, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్యలకు పాల్పడిందని మండిపడ్డారు. ఓటు చోరీ తర్వాత ఇప్పుడు సీటు చోరీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
మీనాక్షి తనకు సోదరి లాంటివారని పేర్కొన్న మహేశ్ కుమార్ గౌడ్, ఈ వ్యవహారంలో ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకుందని ఆరోపించారు. రాజకీయ విభేదాలు సహజమే అయినప్పటికీ, ప్రత్యర్థులను అణగదొక్కేందుకు కుట్రలు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

















