ప్రతిపక్షం, జూన్ 30: కృత్రిమ మేధ (AI) రంగంలో మెటా మరో కీలక ముందడుగు వేసింది. ‘Brain2Qwerty v2’ పేరుతో అభివృద్ధి చేసిన కొత్త AI వ్యవస్థ మెదడులోని నాడీ సంకేతాలను విశ్లేషించి వాటిని నేరుగా టెక్స్ట్‌గా మార్చగలదని సంస్థ వెల్లడించింది.
మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తులు తమ మనసులో ఏమనుకుంటున్నారో ఈ సాంకేతికత ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందని మెటా తెలిపింది. ఈ వ్యవస్థకు శస్త్రచికిత్సలు లేదా మెదడులో చిప్‌లను అమర్చాల్సిన అవసరం లేదని, మాగ్నెటోఎన్సెఫలోగ్రఫీ (MEG) వంటి నాన్-ఇన్వేసివ్ రికార్డింగ్ సాంకేతికతతోనే మెదడు సంకేతాలను విశ్లేషించి భాషగా డీకోడ్ చేస్తుందని వివరించింది.
ప్రారంభ పరీక్షల్లో ఈ AI వ్యవస్థ సుమారు 78 శాతం ఖచ్చితత్వం సాధించినట్లు మెటా వెల్లడించింది. భవిష్యత్తులో మాట్లాడే సామర్థ్యం కోల్పోయిన రోగులకు ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
















