[t4b-ticker]

భట్టి విక్రమార్కతో రాజగోపాల్‌రెడ్డి భేటీ.. కారణం ఇదేనట!

ప్రతిపక్షం, ఆగస్టు 26: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలిశారు. తన నియోజకవర్గానికి సంబంధించిన బిల్లుల విషయంపై చర్చించేందుకే భట్టిని కలిసినట్లు రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టం చేశారు.

ప్రజాభవన్‌కు తాను వెళ్లిన సమయంలో అక్కడ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజాభవన్‌లో కొండా మురళిని కూడా కలిసినట్లు రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు, వాటికి సంబంధించిన బిల్లుల అంశంపైనే డిప్యూటీ సీఎంతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

Spread the love

Related News

Latest News