*ఒళ్ళు దగ్గర పెట్టుకొని వార్తలు రాయి.
*ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకుంది
*మీడియా ముసుగులో తెలంగాణ నేతలను కించపరుస్తున్న ఆంధ్ర మీడియాకు వార్నింగ్ ఇస్తున్నా .
*కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
ప్రతి పక్షం మునుగోడు/హైదరాబాద్, ఆగస్టు 26: ABN ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.సోదరా ABN రాధాకృష్ణ మా గురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు అని హెచ్చరిస్తున్నా. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది అని వార్నింగ్ ఇచ్చారు.ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది. మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు. మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది. ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ అని అన్నారు.మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా. ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.





























