[t4b-ticker]

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి

ప్రతిపక్షం, ఆగస్టు 26, ఉత్తర తెలంగాణ బ్యూరో : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్‌ను ఢీకొన్న ఘటనపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన వైద్య సహాయం అందించాలని సూచించారు.ఈ విషాద ఘటనలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.

  • రవీంద్ర భారతిలో..

*ఆదాబ్ హైదరాబాద్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ – 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. హజరైనారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అని కోనియాడారు. ఈ సందర్భంగా ఆదాబ్ సత్యం కు శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి అవార్డులు అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు సరైన సమాచారం అందించడంతో పాటు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కూడా మీడియా బాధ్యత అని అన్నారు.

  • ఘనంగా పండగ సాయన్న జయంతి,

*పండగ సాయన్న జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి ముదిరాజ్‌ సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ముదిరాజ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బొర్ర జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో ముదిరాజ్‌ సంఘం నాయకులు బుధవారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.*పండగ సాయన్న జయంతి, వర్ధంతుల అధికారిక నిర్వహణపై ప్రభుత్వం వారం రోజుల్లోనే నిర్ణయం తీసుకోవడం పట్ల ముదిరాజ్‌ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం బహుజన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని బొర్ర జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ అన్నారు.

** నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో..

డాక్టర్ బుసాని బాబు రావు వర్మ శతజయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు , వి.హనుమంతరావు , మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ,బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, తదితరులు పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాసేవ, సామాజిక న్యాయం, సామాజిక అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన డాక్టర్ బుసాని బాబు రావు వర్మ సేవలు అభినందనీయం ఎంతో ఆదర్శవంతమైనవన్నారు.

Spread the love

Related News

Latest News