నిర్మల్ జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 6 : రాష్ట్ర ప్రభుత్వ అన్ని పాఠశాలల బలోపేతం, పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు చేపట్టే ‘బడిబాట’ కార్యక్రమాన్ని ఉపాధ్యాయలు బాధ్యతతో పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 6 నుంచి 19 వరకు విద్యాశాఖ సూచించిన మార్గదర్శకాల ప్రకారం.. బడిబాటను నిర్వహించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పాఠశాల ఉన్న పరిసరాలు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు ఇతర సౌకర్యాలను పోషకులకు అవగాహన కల్పించాలన్నారు. 15 రోజులపాటు నిర్వహించుకునే ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్లాలని కోరారు.