ప్రతిపక్షం, స్పోర్ట్స్: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో 3,000 పరుగులు మైలు రాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. పీఎస్‌ఎల్-2024 సీజన్‌లో భాగంగా ఆదివారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద.. బాబర్ ఈ ఘనతను అందుకున్నాడు. ఆజం ఇప్పటివరకు 78 ఇన్నింగ్స్‌లలో 3,003 పరుగులు చేశాడు. బాబర్ తర్వాత పాక్ ఓపెనర్ ఫఖార్ జమాన్(2381) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 16 పరుగుల తేడాతో పెషావర్ జల్మీపై క్వెట్టా గ్లాడియేటర్స్ విజయం సాధించింది.