ప్రతిపక్షం, జూన్ 13: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 కార్గో విమానం కుప్పకూలిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సిబ్బంది మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన కో-పైలట్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గల కారణాలపై భారత వైమానిక దళం ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను గుర్తించనున్నట్లు అధికారులు తెలిపారు.
















