[t4b-ticker]

చండూర్ మార్కెట్ యార్డ్ చోరీ కేసులో 11 మంది అరెస్ట్ .రూ. 9.80 లక్షల నగదు సీజ్

చండూర్ మార్కెట్ యార్డ్ లో రూ. 7 లక్షల ధాన్యం చోరీ

11 మంది అరెస్ట్, రూ. 9.80 లక్షల నగదు సీజ్ .

దొంగలను బెదిరించి రూ. 5 లక్షలు దోచిన మరో గ్యాంగ్ .

11 ఫోన్లు, బొలెరో స్వాధీనం…. బొలెరో వాహనం TS 07 UK 4505 తో అక్రమ రవాణా

చండూర్ మార్కెట్ యార్డ్ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు .

బి. రాము, సర్కిల్ ఇన్స్పెక్టర్, చండూర్ సర్కిల్.

ప్రతి పక్షం చండూరు ఆగస్టు 27 : చండూర్ మార్కెట్ యార్డ్ లో వడ్ల దొంగతనం మరియు దొంగతనం చేసిన వ్యక్తులను బెదిరించి, భయపెట్టి దోపిడీ చేసిన వ్యక్తుల అరెస్ట్. చండూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని పలు రోజులుగా దొంగతనం చేసి సూర్యాపేట మార్కెట్ లో విక్రయించిన ముగ్గురు నిందితులను చండూర్ పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా, ఈ దొంగతనం చేసిన వారిని బెదిరించి, చంపుతాం అని బెదిరిస్తూ రూ. 5 లక్షలు డిమాండ్ చేసి వసూలు చేసిన పదకొండు మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని చండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. రాము తెలిపారు .

చండూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 103/2026 U/s 331(4), 305(a), 238, 308 (5) r/w 3(5) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫిర్యాదుదారుని వివరాలు:
తెలుకుంట్ల శ్రీనివాసులు తండ్రి క్షేత్రయ్య , వయస్సు: 54 సంవత్సరాలు, కులం: రెడ్డి, వృత్తి: బిజినెస్, నివాసం: శారదా కాలనీ, చండూర్ టౌన్.
దొంగతనం నిందితుల వివరాలు:
A-1. నాగళ్ల ఆంజనేయులు, తండ్రి: లింగయ్య, వయస్సు: 40 సంవత్సరాలు, కులం: రజక, వృత్తి: కూలీ, నివాసం: నేతాజీ నగర్, చండూర్ టౌన్.
A-2. బ్రహ్మోజు ప్రకాష్, తండ్రి: జంగయ్య, వయస్సు: 40 సంవత్సరాలు, కులం: కంచరి, వృత్తి: డ్రైవర్, నివాసం: MRO కార్యాలయం సమీపంలో, చండూర్ టౌన్.
A-3. మెతరి నాగేష్, తండ్రి: దుర్గయ్య, వయస్సు: 26 సంవత్సరాలు, కులం: ఎస్సీ మాదిగ, వృత్తి: కూలీ, నివాసం: అంబేద్కర్ కాలనీ, చండూర్ టౌన్.
దోపిడీ నిందితుల వివరాలు:
A-4. దేటి వెంకన్న, తండ్రి: నరసింహ, వయస్సు: 43 సంవత్సరాలు, కులం: యాదవ్, వృత్తి: మేస్త్రీ, నివాసం: కనకదుర్గ వీధి, చండూర్ టౌన్.
A-5. వేముల పవన్, తండ్రి: నాగేష్, వయస్సు: 27 సంవత్సరాలు, కులం: గౌడ్, వృత్తి: వ్యాపారం, నివాసం: సర్దార్ కాలనీ, చండూర్ టౌన్.
A-6. దోటి శివ, తండ్రి: శ్రీను, వయస్సు: 27 సంవత్సరాలు, కులం: యాదవ్, వృత్తి: డ్రైవర్, నివాసం: సర్దార్ కాలనీ, చండూర్ టౌన్.
A-7. బీమనపల్లి గణేష్, తండ్రి: యాదయ్య, వయస్సు: 25 సంవత్సరాలు, కులం: గౌడ్, వృత్తి: డ్రైవర్, నివాసం: సర్దార్ కాలనీ, చండూర్ టౌన్.
A-8. దోటి నరేష్, తండ్రి: యాదయ్య, వయస్సు: 26 సంవత్సరాలు, కులం: యాదవ్, వృత్తి: డ్రైవర్, నివాసం: సర్పంచారిందం నగర్, చండూర్ టౌన్.
A-9. గండూరి మల్లేష్, తండ్రి: వెంకటేశం, వయస్సు: 27 సంవత్సరాలు, కులం: ముదిరాజ్, వృత్తి: మహీంద్రా షోరూం ఉద్యోగి, నివాసం: నేతాజీ నగర్, చండూర్ టౌన్.
A-10. బెత వెంకన్న, తండ్రి: మల్లయ్య, వయస్సు: 32 సంవత్సరాలు, కులం: యాదవ్, వృత్తి: JCB డ్రైవర్, నివాసం: కొలబోయిగూడెం గ్రామం.
A-11. గోల్కొండ శేఖర్, తండ్రి: పద్మయ, వయస్సు: 22 సంవత్సరాలు, కులం: ఎస్సీ డెమ్మరి, వృత్తి: డ్రైవర్, నివాసం: సర్దార్ కాలనీ, చండూర్ టౌన్.
A-12. నల్ల స్వామి తండ్రి: శ్రీను, వయస్సు: 36 సంవత్సరాలు, కులం: గౌడ్, వృత్తి: సాఫ్ట్ వేర్, చండూర్, నివాసం: అంబేద్కర్ కాలనీ, చండూర్ టౌన్. (Absconding)
కేసు వివరాలు:

ఫిర్యాదుదారు మరియు మరో బాగస్వామి కలిసి కనగల్ మండలం, కుందుర్పల్లి గ్రామంలోని మునిరీర్ పాలాబాయిల్ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మిల్లును నిర్వహిస్తున్నారు. 2025-26 పంట & రబీ సీజన్ కు సంబంధించి రైతుల వద్ద కొనుగోలు చేసిన సుమారు 25,000 క్వింటాళ్ల వడ్లను చండూర్ వ్యవసాయ మార్కెట్ గోడౌన్ లో నిల్వ చేశారు. దానిలో భాగంగా ధాన్యాన్ని మిల్లుకు తరలించే అందులో సుమారు 13,000 క్వింటాళ్ల గోడౌన్ లో ఉండగా ఇందులో అయితే గోడౌన్ పరిశీలించగా షట్టర్ తాళం వద్ద దాన్యం చిందరవందరగా ఉండటం, బస్తాలు గుంజిన ఆనవాళ్లు కనిపించాయి. లెక్కలు పరిశీలించగా సుమారు 600-700 బస్తాల ధాన్యం, విలువ సుమారు రూ.7 లక్షలు, గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ తాళంతో తాళం తెరిచి దొంగిలించారని గుర్తించారు. దీనిపై ఫిర్యాదు తెలుకుంట్ల శ్రీనివాసులు తేదీ: 22.08.2026 రోజున ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు అయింది.

నిందితుల పూర్వాపరాలు & దర్యాప్తు వివరాలు:

తెలుకుంట్ల శ్రీనివాసులు గారి ఫిర్యాదును విచారణ చేయగా, నేరస్తుడు ఏ-1 నాగళ్ల ఆంజనేయులు చండూర్ వ్యవసాయ మార్కెట్ నందు క్రీన్ క్లీన్స్ షాప్ లో గతంలో పని చేసినవాడుగా గుర్తించారు. అలాగే అప్పుడప్పుడు వ్యాపారపు మిల్లులకు నందు హమాలీగా కూడా పనిచేస్తుంటాడు, గత రెండు నెలల క్రితం ఏ-1 వ్యవసాయ మార్కెట్ నందు గోడౌన్ కి చేరగా, దానిపై రాత్రి సమయంలో ఏ-2 & ఏ-3 ల సహాయంతో బొలెరో బండి నెంబర్ TS 07 UK 4505 లో వడ్ల దొంగతనం చేసి సూర్యాపేట మార్కెట్ లో అమ్ముకున్నారు. ఇదే క్రమంలో తేదీ: 18.07.2026 రోజున రాత్రి కూడా ఏ-2 ని తీసుకుని TS 07 UK 4505 బండి లో వడ్ల దొంగతనం లో పాల్గొనగా ఆ సమయంలో ఏ-4 నుండి ఏ-11 వరకు దొంగతనం చేస్తున్న ఏ-1 & ఏ-2 లను పట్టుకొని, వారిని బెదిరించి, చంపుతాం అని బెదిరించి ఏ-1 వద్ద 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇందులో ఏ-12 వద్ద దొంగతనంగా అమ్ముకుంటున్నారు అని ఏ-4 ద్వారా తెలిసి నేరస్థులకు వారిపై ఏ-4 నుండి ఏ-11 లు బెదిరింపుగా వీడియో, బొలెరో తో కూడా సిద్ధం ఉండి వెళ్లినారు.

నిందితుల గత చరిత్ర:

  • A-3 మెతరి నాగేష్, తండ్రి: దుర్గయ్య పై CR NO. 166/2022 U/S 363,376(2)(n) IPC, Sec 5(1) r/w 6 of POCSO Act of Chandur PS.
  • A-5 వెల్ముల పవన్, తండ్రి: నాగేష్ & A-9 గందూరి మల్లేష్, తండ్రి: వెంకటేశం లపై CR NO. 94/2020 U/S 341, 307, 506 R/W 34 IPC of Chandur PS.
  • A-7 బీమనపల్లి గణేష్, తండ్రి: యాదయ్య & దోటి సతీష్, తండ్రి: యాదయ్య A-8 లపై CR NO. 77/2024 U/S 118(1) r/w 34 IPC of Chandur PS.

ఈ కేసును నల్గొండ డీఎస్పీ కె. శివరామిరెడ్డి పర్యవేక్షణలో, చండూర్ CI బి. రాము ఆధ్వర్యంలో త్వరితగతిన ఛేదించిన ఎస్ఐ జె.శివకుమార్ మరియు వారి సిబ్బంది ఏ. శివరాం, వి. రమేష్, వి. నరేందర్, బి. రాజు, కె. కృష్ణ కౌశిక్ లను నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవార్, ఐపీఎస్ అభినందించారు.

Spread the love

Related News

Latest News