మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్.
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 27: ఓటరు జాబితాలోని వివరాల పరిశీలన, సవరణల అంశాలపై మెదక్ పట్టణంలోని నవాబ్ పేట్ లో 14, 15 వార్డుల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్ దొంతి లక్ష్మీ పాల్గొన్నారు. మ్యాపింగ్ 2002 లేని ఓటర్ వివరాలు డాక్యుమెంట్ సమర్పించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ సమక్షంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన అర్హులైన కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఫారం–6 సమర్పించాలని వారు సూచించారు. అలాగే ఓటరు జాబితాలో పేరు, వయస్సు, చిరునామా, ఫోటో, బంధుత్వం తదితర వివరాల్లో సవరణలు అవసరమైతే ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రజలు, బిఎల్ఓ లు, బిఎల్ఏ లు, సంబంధిత అధికారులు ఓటరు జాబితాను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సరిచేసుకుని నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీపీవో స్వామి, జూనియర్ అసిస్టెంట్ ప్రకాష్, బిఎల్ ఓ లు జబిన ఫాతిమా, బుచ్చమ్మ, నీలిమ పాల్గొన్నారు.






























