సన్న వడ్లకు రూ.500 బోనస్.. రైతులు వివరాలు నమోదు చేసుకోవాలి
7 రకాల సన్న వడ్లకు మాత్రమే బోనస్.. సెప్టెంబర్ 10 లోగా నమోదు చేసుకోవాలి.
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రిజిస్ట్రేషన్ తప్పనిసరి .
చండూరు మండల వ్యవసాయ అధికారి మల్లేష్ .
ప్రతి పక్షం చండూరు , ఆగస్టు 27: చండూరు మండలంలోని రైతాంగానికి తెలియజేయునది ఏమనగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు ఎంపిక చేసిన 7 సన్న వరి రకాలపై మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వనున్నది అనే విషయాన్ని ఈ వానాకాలం మొదలు నుండి చెబుతూనే ఉన్నాము.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్‌ఎం-7715 రకాలు సాగు చేసిన రైతులు తప్పనిసరిగా విత్తన కొనుగోలు వివరాలతో విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
అలాగే సొంత విత్తనాలు ఉపయోగించిన రైతులు కూడా అర్హత కోసం తమ పరిధిలోని AEOలను సంప్రదించాలని సూచించడమైనది. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే బోనస్ రాదు. కావున చండూర్ మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్ణీత గడువు 10.09.2026 లోగా తమ వివరాలను నమోదు చేయించుకోవాలని తెలిపారు .





























