[t4b-ticker]

రెండు మిల్లులపై అధికారుల కొరడా

•నిబంధనలు ఉల్లంఘించినరెండు రైస్ మిల్లులపై చర్యలు…!!

•రూ.17.25 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు..

వనపర్తి ప్రతినిధి, ఆగస్ట్ 27(ప్రతిపక్షం ): నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న రైస్ మిల్లులపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలోని రెండు రైస్ మిల్లుల్లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కొత్తకోట మండలంలో సాయిబాబా రైస్ మిల్, పెద్దమందడి మండలం మోజర్లలోని చాముండి రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు.రెవెన్యూ, నేషనల్ అసెస్‌మెంట్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (NALA), కాలుష్య నియంత్రణ మండలి, పౌరసరఫరాలు, భూగర్భ జలాలు, అగ్ని మాపక, ఫ్యాక్టరీస్, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు సంబంధిత మిల్లులపై తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. పెద్దమందడి మండలం మోజర్లలోని రైస్ మిల్లులో సుమారు రూ.13,33,11,523 విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చట్టబద్ధమైన నోటీసులు, ఉత్తర్వులు అందించిన అనంతరం ఈ నెల 27న మిల్లు నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొత్తకోట మండలంలోని మరో రైస్ మిల్లులో రూ.3,92,17,269విలువైన ఆస్తులను అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు. నోటీసులు, ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 27న కూల్చివేత చర్యలు చేపట్టాల్సి ఉండగా, మిల్లు యాజమాన్యం అధికారుల చర్యలను అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో అక్కడి బోర్వెల్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు.

💥నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.

ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, అనుమతులు లేకుండా లేదా చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించే మిల్లులపై ఇకపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. బకాయిలు, అక్రమ నిర్మాణాలు, అనుమతుల ఉల్లంఘనలకు సంబంధించి సంబంధిత మిల్లులపై చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News