[t4b-ticker]

ఎమ్మెల్యే కు రాఖీ కట్టిన మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్.. ఎమ్మెల్యే ఇంట్లో రాఖీ సంబరాలు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 27: “రాఖీ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల బంధానికి గుర్తు మాత్రమే కాదు.. ఆప్యాయత, విశ్వాసం, పరస్పర సహకారానికి ప్రతీక. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ, యువతకు అండగా నిలుస్తున్న డా. మైనంపల్లి రోహిత్ రావు కు రాఖీ కట్టడం ఎంతో సంతోషంగా ఉందని మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధికా భూపతి రాజు తెలిపారు. గురువారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హైదరాబాద్ లోని ఇంట్లో మెదక్ మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు లు తో కలిసి.రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ మాట్లాడుతూ.ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న డా. మైనంపల్లి రోహిత్ నాయకత్వంలో మెదక్ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆమె తెలిపారు.రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా.. అభివృద్ధి కోసం కలిసి పనిచేసే నాయకత్వానికి ఈ రాఖీ బంధం ఒక ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

మెదక్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా యువ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ, అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతామని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా డా. మైనంపల్లి రోహిత్ రావు , వారి కుటుంబ సభ్యులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు. బుజరంపేట అరుణ, రాగి వనజ, చేదల్ సంధ్య, పల్లె రాణి, రాజ్యమా, పుట్టాల లలిత, నాశ్రీన్, అనూష. కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News