[t4b-ticker]
ఆగస్టు 15 నుంచి తలసేమియా, సికిల్‌సెల్ బాధితులకు పింఛన్లు.. గ్రామీణాభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ఆగస్టు 15 నుంచి తలసేమియా, సికిల్‌సెల్ బాధితులకు పింఛన్లు.. గ్రామీణాభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ప్రతిపక్షం, జూలై 31: రాష్ట్రంలోని తలసేమియా, సికిల్‌సెల్ అనీమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులను వెంటనే గుర్తించి ప్రక్రియను పూర్తి చేసి, ఆగస్టు 15 నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని సూచించారు. ఈ పింఛన్లు బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి, వారి జీవనభారాన్ని కొంతవరకు తగ్గిస్తాయని సీఎం పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, గీత కార్మికులు వంటి అర్హులందరికీ సంతృప్తికర స్థాయిలో పింఛన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే దివ్యాంగులు మరణించిన...
ప్రపంచ స్థాయి విద్యే లక్ష్యం.. స్కిల్స్‌తో తెలంగాణ విద్యార్థులకు కొత్త దారి: సీఎం రేవంత్

ప్రపంచ స్థాయి విద్యే లక్ష్యం.. స్కిల్స్‌తో తెలంగాణ విద్యార్థులకు కొత్త దారి: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 30, హైదరాబాద్: మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థను పూర్తిగా రూపాంతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య అందించిన అనంతరం విద్యార్థులను స్కిల్ ఆధారిత ఉపాధి అవకాశాల వైపు మళ్లించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. భవిష్యత్ తరాల జీవితాలను మార్చే శక్తి ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని పేర్కొంటూ, వచ్చే ఐదేళ్లు విద్యా రంగాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో పనిచేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ దాశరథి ఆడిటోరియంలో నిర్వహించిన "టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్" కార్యక్రమంలో ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా...
పేపర్ లీక్‌లకు అడ్డుకట్ట వేస్తాం.. బాధ్యులపై కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

పేపర్ లీక్‌లకు అడ్డుకట్ట వేస్తాం.. బాధ్యులపై కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 28: ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు సమగ్ర విధానం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షల్లో పెద్దగా సమస్యలు ఎదురుకాలేదని, ఆఫ్‌లైన్ విధానంలోనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. అనుమతులు లేకుండా దేశవ్యాప్తంగా కోచింగ్ కేంద్రాలు భారీగా పెరుగుతున్నాయని, కొన్ని చోట్ల అవే ప్రశ్నాపత్రాల లీకేజీలకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యపై రాష్ట్రాలకే...
తెలంగాణకు 11.56 లక్షల ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వినతి

తెలంగాణకు 11.56 లక్షల ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వినతి

ప్రతిపక్షం, జూలై 28: తెలంగాణలో పేదలకు గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద రాష్ట్రానికి 11.56 లక్షల ఇళ్లను తక్షణమే కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కృషి భవన్‌లో కేంద్ర మంత్రితో సమావేశమైన సీఎం, రాష్ట్రంలోని గ్రామీణ గృహ అవసరాలు, ఉపాధి హామీ పథకం విస్తరణ, రైతుల జీవనోపాధి మెరుగుదలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను ఆయన ముందుంచారు. సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చడాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని సీఎం వివరించారు. గత పదేళ్లలో రాష్ట్రంలో PMAY-G పథకాన్ని సమర్థంగా వినియోగించకపోవడంతో వేలాది గ్రామీణ...
21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 26, హైదరాబాద్: దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే జెన్‌జీ (Gen Z) యువతకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన చట్ట సవరణను పార్లమెంట్‌లో తీసుకురావాలని కోరారు. హైదరాబాద్‌లో "యువతే దేశం – దేశమే యువత" పేరుతో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. నీట్ వంటి పరీక్షల్లో జరిగిన అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, వాటి కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆత్మహత్యలు,...
Spread the love