Trending Now

Economic Commission: ప్రజా భవన్‌లో 16వ ఆర్థిక సంఘం భేటీ

16th Finance Commission meeting at Praja Bhavan: ఇవాళ హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో రెండో రోజు 16వ ఆర్థిక సంఘం భేటీ అయ్యింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రజా భవన్‌‌లో సంఘం చైర్మన్ అర్వింద్ పణగారియా, సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు భేటీ అయ్యారు. జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది. వర్షాలు, కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధులను పెంచేలా విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయం విషయంలో కూడా మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. రాష్ట్ర పర్యటనలో భాగంగా చైర్మన్‌ అరవింద్‌ పనగరియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ బృందంలో అజయ్‌ నారాయణ్‌ ఝా, యానీ జార్జి మ్యాథ్యూ, మనోజ్‌ పాండా, డాక్టర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ సభ్యులుగా ఉన్నారు.

Spread the love

Related News

Latest News