ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 30 : 1970లో కలకత్తాలో జరిగిన మహాసభ సభ ద్వారా సీఐటీయూ ఆవిర్భవించింది. సీఐటీయూ ఆవిర్భవించిందని కార్మికుల హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసమే నిత్య పోరాటాలు చేస్తూ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ జిల్లా కోశాధికారి లలితను పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిఐటియు సంఘ భవనంలో గురువారం 54వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని సీఐటీయూ జెండాను ఎగరవేసి లాంఛనంగా నిర్వహించారు.
భారత రాజ్యాంగ నియమ నిబంధనలకు అనుగుణంగా ఇప్పటికే వేలాది పోరాటాలు, ఉద్యమాలు కార్యక్రమాలను నిర్వహిస్తూ సీఐటీయూ, దేశంలోనే ఉన్నత స్థానంలో ఉందని చెప్పారు. జాతీయస్థాయిలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించి సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం ఏ తరహ లో ముందుకెళ్లాలో పలు అవగాహన కార్యక్రమాల ద్వారా తెలియజేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్మికులు నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.